Monday, December 8, 2025
E-PAPER
Homeఆటలుఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి

ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి

- Advertisement -

జేపీఎల్‌ సీజన్‌2 ప్రారంభోత్సవంలో హరీశ్‌రావు
హైదరాబాద్‌ :
సమాజహితం కోసం నిబద్ధతతో పనిచేసే పాత్రికేయులు పని ఒత్తిడిలో చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాత్రికేయులు ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆరోగ్య శాఖ మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ తెలంగాణ (ఎస్‌జేఏటీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జర్నలిస్ట్‌ ప్రీమియర్‌ లీగ్‌ (జేపీఎల్‌) సీజన్‌2ను దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఆయన ప్రారంభించారు. నిత్యం బిజీగా ఉండే జర్నలిస్ట్‌లు ప్రొఫెషనల్‌ క్రికెటర్ల తరహాలో ఐదు రోజుల పాటు టోర్నమెంట్‌లో పోటీపడటం హర్షనీయమని అన్నారు. పది జట్ల ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌ రావు.. జెర్సీలను అధికారికంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్‌ రెడ్డి, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, శాట్స్‌ మాజీ చైర్మెన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి, స్పోర్టివో ఎండీ చల్లా భరత్‌ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
వెటరన్‌ అథ్లెట్‌ లక్ష్మణ్‌రెడ్డికి సన్మానం :
ఎనిమిది పదుల వయసులో కృష్టా నదిని అలవోకగా ఈదిన వెటరన్‌ అథ్లెట్‌, ఎంఎల్‌ఆర్‌ఐటీ విద్యా సంస్థల చైర్మెన్‌ మర్రి లక్ష్మణ్‌రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదివారం ఘనంగా సన్మానించారు. ‘లక్ష్మణ్‌రెడ్డి 81 ఏండ్ల వయసులోనూ 21 ఏండ్ల కుర్రాడిలా ఉత్సాహంగా ఉన్నారు. యువత లక్ష్మణ్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలి. అరుంధతి హాస్పిటల్‌లో పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి లక్ష్మణ్‌రెడ్డిని సైతం హరీశ్‌రావు ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -