నవతెలంగాణ-హైదరాబాద్ : ఒడిశాలో అధిక వర్షాలతో కొండచరియలు విరిగి పడి రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను హెల్త్ సూపర్‌వైజర్ తన భుజాలపై మోసుకుంటూ అంబులెన్స్ వద్దకు చేర్చాడు. ఈ ఘటన మల్కన్‌గిరి జిల్లాలో చోటుచేసుకుంది. మైథిలి బ్లాక్ పరిధిలోని తులసి గ్రామానికి చెందిన మంగళ్‌దీ దురువా అనే మహిళ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ ప్రాంతంలోని రోడ్లు ధ్వంసమై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆ మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లడం కష్టంగా మారింది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు అంబులెన్స్‌కు సమాచారమిచ్చారు. రహదారి దెబ్బతినడంతో అక్కడికి వాహనం చేరుకోలేకపోయింది. అయితే.. కుటుంబసభ్యులు ఓ కర్రకు వస్త్రం కట్టి అందులో ఆమెను మోసుకుంటూ తీసుకెళ్లారు. ఇది గమనించిన హెల్త్ సూపర్‌వైజర్ హరికృష్ణ సైతం వారికి అండగా నిలిచాడు. ఆ మహిళను 5 కిలోమీటర్ల మేర మోసుకుంటూ అంబులెన్స్ వద్దకు చేర్చాడు. అనంతరం అక్కడి నుంచి ప్రాథమిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. హెల్త్ సూపర్‌వైజర్ చొరవను గ్రామస్థులు అభినందిస్తున్నారు.
రోగిని 5 కి.మీ.లు మోసిన హెల్త్ సూపర్‌వైజర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES