- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్ ( రాజంపేట్ )
రాజంపేట్ పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం మెడికల్ అధికారి విజయ మహాలక్ష్మి ఆధ్వర్యంలో ఆరోగ్యం మహిళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న మహిళలకు వైద్య, రక్త పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ మంజూర్, గంగమణి, స్టాఫ్ నర్స్ ఇందిరా, ఫార్మసిస్ట్ పద్మ, సంతోష్ ల్యాబ్ టెక్నిక్షన్, ఎ ఎన్ ఎం, ఆశలు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



