వాదనలు వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
ఢిల్లీ వెళ్లిన మంత్రులు భట్టి, పొన్నం, వాకిటి శ్రీహరి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ జారీ చేసిన జీవోపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. రిజర్వేషన్ల అంశంపై కోర్టులో వ్యవహరించాల్సిన అంశాలపై న్యాయ కోవిదులతో సలహాలు, సూచనలు స్వీకరించి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభు త్వం సిద్ధమైంది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి సంప్రదింపులు జరిపారు. ఆదివారం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నట రాజన్‌తోనూ వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ అభ్యర్థి, ఓట్ చోరీ సంతకాల సేకరణ, డీసీసీ అధ్యక్షుల ఎంపిక, పార్టీ సంసా ్థగత నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం వారు ఢిల్లీకి బయలుదేరారు.
మీనాక్షి నటరాజన్‌తో భేటీ అయ్యాక.. మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకర్లతో మాట్లా డుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం జరుగు తున్నదని విమర్శించారు. హైకోర్టు, సుప్రీం కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు కూడా బీసీ రిజర్వేషన్ల గురించి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ,ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రాజ్యాం గబద్ధంగా రిజర్వేషన్లు ఉన్నట్టుగానే బలహీ నవర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. బీసీలకు రిజర్వే షన్లు కల్పించడం వల్ల ఎవరికీ నష్టం ఉందని చెప్పారు. బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చే విధంగా రాహుల్‌గాంధీ ఆలోచనా విధానంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రిజర్వేషన్లను ముందుకు తీసుకుపోతున్నట్టు తెలిపారు. కొంతమంది వ్యక్తిగతంగా రెడ్డి జాగృతి పేరుతో చేస్తున్నప్పటికీ అందరికీ సంబంధం ఉందనేది ఆవాస్తవమన్నారు. అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో ఈ బిల్లు ముందుకు సాగుతున్నదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి పార్టీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్‌కు నలుగురితో జాబితా సీఎం రేవంత్‌రెడ్డి, మీనాక్షి నటరాజన్‌తో సంప్రదింపులు
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే అంశంపై ఆ పార్టీ కసరత్తు పూర్తి చేసింది. నలుగురి పేర్లతో కూడిన జాబితాను కూడా సిద్ధం చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్ నేత నవీన్‌యాదవ్, మాజీ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ పేర్లు ఆ జాబితాలో ఉన్నట్టు సమాచారం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని బృందం ఆ జాబితాను సోమవారం ఢిల్లీలో ఏఐసీసీ నేతలకు అందజేయనుంది.