- Advertisement -
నవతెలంగాణ- హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లఅమలు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)ను సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపైనే స్థానిక ఎన్నికల నిర్వహణ, బీసీల రిజర్వేషన్ల భవితవ్యం ఆధారపడి ఉండటంతో అత్యున్నత ధర్మాసనం ఏ తీర్పు ఇస్తుందోనని రాజకీయవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే.
- Advertisement -