Sunday, April 5, 2026
E-PAPER
Homeజాతీయంవాంగ్‌చుక్‌ నిర్బంధంపై విచారణ 26కి వాయిదా

వాంగ్‌చుక్‌ నిర్బంధంపై విచారణ 26కి వాయిదా

- Advertisement -

న్యూఢిల్లీ : సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌ చుక్‌ నిర్బంధంపై ఆయన భార్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు ఈనెల 26కి వాయిదా వేసింది. సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అందుబాటులో లేనందున విచారణను జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌, జస్టిస్‌ పి.బి.వర్లేలతో కూడిన ధర్మాసనం సోమవారం తెలిపింది. వాంగ్‌చుక్‌ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, ఆయన నిర్బంధాన్ని పున:పరిశీలించే అవకాశం ప్రభుత్వానికి ఉందా అని సుప్రీంకోర్టు తొలుత కేంద్రాన్ని కోరింది.

గతేడాది సెప్టెంబర్‌లో లెహ్‌లో ఉద్రిక్తతలకు వాంగ్‌చుక్‌ కారణమని, ఈ హింసాకాండలో నలుగురు మరణించగా, 161మంది గాయపడ్డారని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కె.ఎం.నటరాజ్‌ ధర్మాసనానికి తెలిపారు. సున్నితమైన సరిహద్దు ప్రాంతంలో ప్రజలను రెచ్చగొట్టినందుకు వాంగ్‌చుక్‌ను అదుపులోకి తీసుకున్నట్లు కేంద్రం మరియు లడఖ్‌ యంత్రాంగం కోర్టుకు తెలిపింది. జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ) కింద వాంగ్‌చుక్‌ అరెస్టును సవాలు చేస్తూ ఆయన భార్య గీతాంజలి జె.అంగ్మో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -