– మణుగూరు ఏరియా ఏరియా హాస్పిటల్ ముందడుగు..
నవతెలంగాణ – మణుగూరు: గుండెపోటు అత్యవసర చికిత్సలో మణుగూరు ఏరియా ఆసుపత్రి ముందడుగు వేసింది. గురువారం అక్యూట్ మయోకార్డియల్ ఇన్‌ఫార్క్షన్ ఎంఐతో వచ్చిన రోగిని విజయవంతంగా ప్రభుత్వ వైద్యులు రక్షించారు పల్లె స్థాయిలో గుండె అత్యవసర చికిత్సలో మణుగూరు ఏరియా ఆసుపత్రి చారిత్రాత్మక ముందడుగు వేసింది. ఎ. శ్రీనివాస్, 40 సంవత్సరాలు, శేషగిరినగర్ తీవ్రమైన ఛాతి నొప్పి, బిగుతు, అధిక చెమటలు, వాంతులు తో ఆస్పత్రికి వచ్చారు.
బిపి 210/110 ఎం ఎం హెచ్ జి పి ఆర్ 88 ఎస్ పి O₂ – 100% ఈసీజీ అక్యూట్ ఎం ఐ సూచనలు అత్యవసరంగా టెనెక్టెప్లేస్ తో థ్రాంబోలైసిస్ చేయబడిందని డాక్టర్ మార్త సాహి మోహన్ ఎండి ఫిజీషియన్ తెలిపారు. ఇంజెక్షన్ ఖర్చు1.5 లక్షలు రక్తపోటు 140/90 ఎం ఎం హెచ్ జి కి స్థిరపడింది కరోనరీ రీపర్ఫ్యూషన్ విజయవంతమైందన్నారు ఎలాంటి రక్తస్రావ సమస్యలు లేకుండా రోగిని 6 గంటల గోల్డెన్ విండోలో పి సి ఐ సెంటర్‌కి తరలించామని డాక్టర్లు తెలిపారు.
విజయం సాధించిన బృందం డా. మార్థి సాయి మోహన్ యాదవ్, ఎండి ఫిజీషియన్ సిస్టర్ ఉమా ఈ విజయవంతమైన చికిత్స మణుగూరు ఏరియా హాస్పిటల్‌లో తొలిసారి జరిగిన ముఖ్య ఘట్టం, ప్రాణాపాయ పరిస్థితుల్లో గుండెపోటు రోగులను సమర్థవంతంగా చికిత్స చేయగల సత్తా పెరిగిన దానికి నిదర్శనం అన్నారు ప్రత్యేక కృతజ్ఞతలు ఈ విజయానికి దోహదం చేసిన గౌరవనీయ ఎమ్మెల్యే మర్యాదపూర్వక జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి (డి సి హెచ్ ఎస్) కి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.