- Advertisement -
ఒక్క చెట్టుకొమ్మలు, వేళ్ళు ఎప్పటికీ
వేరు కావు అవి చెట్టు ఎదుగుదలకు
శ్రమ పడ్డట్టు కుటుంబం కూడా అంతే
నాన్న అరచేయికి పూసిన అయిదు వేళ్ళలా
ఏదైనా పీడ వచ్చి చిందర బందర చేస్తే
ఒక్క మనసు కూడలిలో కూర్చుని
నాలుగు ముచ్చట్లు ముందేసుకుని మంచిని
సప్పరిస్తూ చెడును ఎరివేయాలి
కుటుంబం కొమ్మలు విరచకుండా
మాటలను మంచి లో ముంచి మాట్లాడాలి
సెగలు కక్కే ,విషం కక్కే,
గుండెలు కోసే మాటలను ఒక్కొక్కటిగా సున్నితంగా ఏరివేసి
జీవిత అనుభవాల కొలనులో కొంతసేపు నానేయాలి
కొంత సమయం తీసుకోవాలి
గుండెలో మంచు కొండలను అల్లుకొని
అందులో అందరిని నింపుకోవాలి
మన ఉదయానికి హదయం నడకలు నేర్పించాలి.
గుండెల్లి ఇస్తారి, 9849983874
- Advertisement -



