Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘట్‌కేసర్ – యాదాద్రి ఎంఎంఎంటీఎస్ ప్రాజెక్టు పునరుద్ధరణ..ఎంపీ చామాలకు హృదయపూర్వక అభినందనలు

ఘట్‌కేసర్ – యాదాద్రి ఎంఎంఎంటీఎస్ ప్రాజెక్టు పునరుద్ధరణ..ఎంపీ చామాలకు హృదయపూర్వక అభినందనలు

- Advertisement -

– తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. రేఖా బోయలపల్లి

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ ఘట్‌కేసర్ – యాదాద్రి మధ్య 33 కిలోమీటర్ల ఎంఎంఎంటీఎస్ రైలు ప్రాజెక్టు పునరుద్ధరణకు కేంద్రం నుండి ₹100 కోట్లు మంజూరైన సందర్భంలో, భువనగిరి ఎంపీ చామాల కిరణ్ కుమార్ రెడ్డి అచంచలమైన కృషిని మేము గర్వంతో ప్రశంసిస్తున్నామ‌న్నారు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. రేఖా బోయలపల్లి. ఒక ప్రాజెక్టు ఆమోదం పొందిన దశ నుండి నిధులు విడుదలై కార్యరూపం దాల్చే వరకు జరిగే ఉద్యమం వెనుక ఉండేది నిజమైన నాయకత్వంమ‌ని కొనియాడారు.

ఈ ప్రాజెక్టు 2016లోనే ఆమోదం పొందినప్పటికీ, గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అమలవకుండా మిగిలిపోయింది. కానీ చామాల కిరణ్ పార్లమెంట్‌లో జీరో అవర్ లో ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా మరోసారి ప్రాజెక్టుకు ప్రాధాన్యత తీసుకొచ్చారు. అదే ఫలితంగా కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టును పూర్తి నిధులతో చేపట్టి, మొదటి దశగా ₹100 కోట్లు కేటాయించడం ఒక చారిత్రాత్మక విజయం.

ఈ ప్రాజెక్టు ఇప్పటిదాకా జాప్యం చెంది ఉండటం వెనుక రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఉన్నా… కేంద్రం నిఖార్సైన సహకారం, ఎంపీ కృషి వల్ల ప్రజలకు ఊరట లభించింది. ఇది మాటల నాయకత్వం కాదు… మార్పు కోసం నిత్యం కృషిచేసే నాయకత్వం తో సాధ్యం అని ఎంపీ చామాల కిరణ్ కుమార్ రెడ్డి నిరూపించారు నాయకత్వం అనేది హోదా కోసం కాదు… ప్రజల సేవ కోసం!
ఈ ప్రాజెక్టు భవిష్యత్ తరాల కోసం ఉపయోగపడే ఒక శాశ్వత వనరుగా మారుతుంది. ఈ విజయం భువనగిరి ప్రజల గర్వకారణం. చామాల కిర‌ణ్ కుమార్‌ని ఓటుతో గెలిపించిన ప్రజలకు ఇది న్యాయం చేసిన రోజుగా నిలిచిపోతుంద‌న్నారు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. రేఖా బోయలపల్లి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -