నవతెలంగాణ-హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆదివారం శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాగానే.. కమిషన్ నివేదిక సమగ్ర ప్రతిని ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. దీనిపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడతారు. అనంతరం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై 50% ఉన్న సీలింగ్‌ను ఎత్తివేస్తూ సవరణ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెడుతుంది. తద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లు ఆమోదం అనంతరం కాళేశ్వరంపై చర్చ జరుగుతుంది. ఘోష్ కమిషన్ నివేదికపై రోజంతా హోరాహోరీ చర్చ సాగే అవకాశముంది. అనంతరం సభకు కొద్దిరోజుల విరామం ప్రకటించే అవకాశాలున్నాయి.
నేడు అసెంబ్లీలో కాళేశ్వరంపై హోరాహోరీ చర్చ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES