Tuesday, September 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతాలి పేరు ప్రాజెక్టుకు భారీ వరద పోటు

తాలి పేరు ప్రాజెక్టుకు భారీ వరద పోటు

- Advertisement -

– ఏడు గేట్లు పూర్తిగా ఎత్తి 58,695 క్యూసెక్కుల నీరు విడుదల

నవతెలంగాణ-చర్ల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుకుంది. సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో కురుస్తున్న భారీ వర్షాలకు మంగళవారం రాత్రి 7:30 సమయం వరకు భారీగా వరద నీరు రావడంతో ముందస్తు జాగ్రత్త కోసం అధికారులు 24 గేట్లకు గాను 7 గేట్లు పూర్తిగా ఎత్తి 58,695 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు సరాసరి నీటిమట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుతం 73.52 మీటర్లు నీటి నిలువ ఉంచి అధికంగా వస్తున్న 34 వేల క్యూసెక్కుల నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా, తాలిపేరు ప్రాజెక్టు తీరంలో ఉన్న దోస్తులపల్లి, అంజనాపురం, కేశవపురం, దండుపేట కాలనీ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -