Friday, April 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలునిజాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న భారీ వరద

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న భారీ వరద

- Advertisement -

నవతెలంగాణ-నిజాంసాగర్
గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద కొనసాగుతుంది. సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు ప్రాజెక్టులోకి 28,128 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. 4 వరద గేట్ల ద్వారా మంజీరా నదిలోకి 27,128 క్యూసెక్కుల నీటిని వదలగా.. ప్రధాన కాలువ ద్వారా 1,000 క్యూసెక్కుల నీటిని వదలడం జరుగుతుందని అని ప్రాజెక్టు ఏఈఈ సాకేత్, అక్షయ్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 17.802టీఎంసీలకు గాను ప్రస్తుతం ప్రాజెక్టులో 17.282 టీఎంసీల నీరు నిల్వ ఉంది అని వారు తెలిపారు. కావున కాలువ పరివాహక ప్రాంతలలోనీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -