Friday, February 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలునిజాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న భారీ వరద

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న భారీ వరద

- Advertisement -

నవతెలంగాణ-నిజాంసాగర్
మొంథా తుఫాను ప్రభావంతో ఎక్కువ ప్రాంతాలతో పాటు జిల్లాలో రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద కొనసాగుతుంది. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు ప్రాజెక్టులోకి 27,352 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరగా.. నాలుగు వరద గేట్లను ఎత్తి అంతే మొత్తంలో మంజీరా నదిలోకి నీటిని విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్, అక్షయ్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 17.802టీఎంసీలకు గాను ప్రస్తుతం ప్రాజెక్టులో 17.802టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు చెప్పారు. కాబట్టి కాలువ,నది పరివాహక ప్రాంతలలోనీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -