Tuesday, September 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలుజూరాలకు భారీగా వరద..42 గేట్లు ఎత్తివేత

జూరాలకు భారీగా వరద..42 గేట్లు ఎత్తివేత

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. ఎగువన వర్షాలు, జలాశయాల నుంచి నీటిని విడుదల చేయడంతో జూరాలకు 3.42 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. దీంతో అధికారులు 42 గేట్లు ఎత్తి 3.16 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. ప్రస్తుతం 8.790 టీఎంసీలు ఉన్నది.

ఇక శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టుకు 3లక్షల57 వేల 333 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 10 గేట్లను 5 అడుగుల మేర, 16 గేట్లను 10 అగుడుల మేర ఎత్తి అతే మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమ, కుడి విద్యుత్‌ ప్లాంట్లలో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.70 అడుగులు ఉన్నది. ప్రాజెక్టులో మొత్తం 312 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. ఇప్పుడు 303.94 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -