Wednesday, April 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజోరుగా వడగండ్ల వాన

జోరుగా వడగండ్ల వాన

- Advertisement -

నవతెలంగాణ-కామారెడ్డి/మిరుదొడ్డి
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం వడగళ్ల వాన కురింది. కామారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి తదితర జిల్లాల్లో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి వడగళ్ల వాన పడింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా ఉండగా, సాయంత్రం ఆకాశంలో మేఘాలు కమ్ముకుని ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట, భూంపల్లి, దుబ్బాక మండలాలు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో, కామారెడ్డిలోని పలు గ్రామాల్లో సాగు చేసిన పంటలకు నష్టం వాటిల్లినట్టు సమాచారం. ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వరి పంట పొట్ట కొచ్చే దశలో రాళ్లు కురవడంతో పంటలు నష్టపోతామని రైతులు చెబుతున్నారు. ఈదురు గాలులతో మామిడి తోటలో కాస్త పూసిన పువ్వు, మామిడికాయలు నేలపాలయ్యాయి. వడగళ్ల వాన కారణంగా కొన్నిచోట్ల స్వల్ప నష్టం జరిగినట్టు సమాచారం. అంతేకాక, సాయంత్రం సమయంలో రహదారులపై వెళ్తున్న వాహనదారులు కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాంతో కామారెడ్డిలో అధికారులు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -