Tuesday, September 23, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్హైదరాబాద్‌కు భారీ వర్షసూచన..ఇళ్లనుంచి బయటకు రావొద్దని హెచ్చరిక

హైదరాబాద్‌కు భారీ వర్షసూచన..ఇళ్లనుంచి బయటకు రావొద్దని హెచ్చరిక

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఎల్లుండి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా.. అల్పపీడన ప్రభావంతో రేపటి నుంచి 27వ తేదీ వరకూ భారీ వర్షాలు కురవనున్నట్లు వెల్లడించారు. మరోవైపు హైదరాబాద్ ను వరుణుడు ముంచెత్తుతున్నాడు. సోమవారం సాయంత్రం నుంచి గ్యాప్ లేకుండా కురిసిన వర్షానికి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేటి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ వెస్ట్ హైదరాబాద్ లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. భారీ వర్షాల నేపథ్యంలో.. ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచించారు. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్ధిపేట, సిరిసిల్ల, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో.. ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు.

యాదాద్రి జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురవగా.. సంస్థాన్ నారాయణపురంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఒక కోళ్లఫారంలోకి భారీగా వర్షపునీరు చేరడంతో ఆస్తినష్టం వాటిల్లిందంటూ రైతు లబోదిబోమంటున్నాడు. కాగా.. హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి. షేక్ పేట్ లో 10.6 సెంటీమీటర్లు, ఖైరతాబాద్ లో 10 సెంటీమీటర్లు, అమీర్ పేట్ లో 6.9, ముషీరాబాద్ లో 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -