- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అల్ప పీడనాల ప్రభావంతో తెలంగాణలో ఈ నెల 30వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం 12 గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది.. గురువారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది ఈనెల 26 నాటికి వాయుగుండంగా మారనుందని వాతావరణకేంద్రం వెల్లడించింది. తదుపరి ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఈనెల 27న తీరం దాటే అవకాశం ఉంది.
- Advertisement -