Monday, September 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవచ్చే మూడ్రోజులు భారీ వర్ష సూచన

వచ్చే మూడ్రోజులు భారీ వర్ష సూచన

- Advertisement -

పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక
హైదరాబాద్‌లో వచ్చే 48 గంటల్లో మోస్తరు వాన
రాష్ట్రంలో ఆదివారం 525 ప్రాంతాల్లో వర్షం
25 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం..
వాయుగుండంగా మారే అవకాశం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్‌ కె.నాగరత్న హెచ్చరించారు. ఈ మేరకు వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నిజామాబాద్‌, రంగారెడ్డి, నిర్మల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. ఈ నెల 25 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందనీ, అది వాయుగుండంగా మారి 27న దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ కోస్తా ప్రాంతంలో తీరం దాటే అవకాశముందని తెలిపారు. ఆదివారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు రాష్ట్రంలో 525 ప్రాంతాల్లో వర్షం కురిసింది. 20 ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. రాష్ట్రంలో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో 11.4 సెంటీమీటర్ల భారీ వర్షపాతం రికార్డయింది. జనగామ జిల్లా దేవరుప్పలలో 11.1 సెంటీమీటర్ల వాన పడింది. వచ్చే 48 గంటల పాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే సూచనలు బలంగా ఉన్నాయి.

అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు
(ఆదివారం రాత్రి పది గంటల వరకు)
ఆత్మకూర్‌(ఎం)( యాదాద్రి భువనగిరి) 11.40 సెంటీమీటర్లు
దేవరుప్పల(జనగాం) 11.10 సెంటీమీటర్లు
నాదర్‌గూల్‌(రంగారెడ్డి) 9.33 సెంటీమీటర్లు
మంగపల్లి(రంగారెడ్డి) 9.25 సెంటీమీటర్లు
వడ్డేకొత్తపల్లి(మహబూబాబాద్‌) 8.9 సెంటీమీటర్లు
హయత్‌నగర్‌(రంగారెడ్ది) 8.5 సెంటీమీటర్లు
పాలడుగు(యాదాద్రి భువనగిరి) 8.5 సెంటీమీటర్లు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -