Monday, March 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాన్సువాడ డివిజన్ లో భారీ వర్షం 

బాన్సువాడ డివిజన్ లో భారీ వర్షం 

- Advertisement -

నవతెలంగాణ- నసురుల్లాబాద్ 
బాన్సువాడ డివిజన్ పరిధిలోని నసురుల్లాబాద్ బీర్కూర్,బాన్సువాడ మండలాల్లో అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. రాత్రి నుంచి ఉదయం పది గంటల వరకు వర్షం కురియడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. నసురుల్లాబాద్ మండలంలో ముందస్తు జాగ్రత్తగా అధికారులు విద్యుత్ సరఫరాల నిలిపివేశారు. వేసవి కాలంలో ఒక్కసారిగా వర్షం కురవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా కురిసిన వర్షానికి వాతావరణం చల్లబడింది. నిజాంసాగర్ ఆయకట్టు సాగుభూములకు ఈ వర్షం ఎంతో మేలు చేసిందని రైతులు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -