Monday, October 13, 2025
E-PAPER
Homeజిల్లాలుచారకొండలో భారీ వర్షం.. రాకపోకలు బంద్ 

చారకొండలో భారీ వర్షం.. రాకపోకలు బంద్ 

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ 
మండల కేంద్రంలోనీ అన్ని గ్రామాలలో ఆదివారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి చారకొండ, ఎర్రవల్లి, గోకారం వాగులు ఉదృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎర్రవల్లి,గోకారం, చంద్రాయన్ పల్లి గ్రామాల ప్రజలు నిత్యవసర సరుకులు కొరకు కల్వకుర్తి వెళ్లడానికి ఇబ్బందిగా మారింది. కల్వకుర్తి నుండి గోకారం-చంద్రాయన్ పల్లికి వెళ్లే బస్సు ఇటీవల కురిసిన వర్షాలకు ఎర్రవల్లి వాగు తెగడంతో బస్సు ఎర్రవల్లి వరకే వచ్చి వెళుతుంది. గోకారం, చంద్రాయన పల్లి తాండ్ర, కల్వకుర్తి పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు  ఇంటి దగ్గరనే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -