నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ నగరవాసులను గురువారం రాత్రి భారీ వర్షం ముంచెత్తింది. ఏమాత్రం ఊహించని విధంగా ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వాన నగరంపై విరుచుకుపడటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ ఆకస్మిక వర్షం కారణంగా నగర జీవనం స్తంభించిపోయింది. నగరంలోని హయత్‌నగర్, ఉప్పల్, కోఠి, తార్నాక, సికింద్రాబాద్ వంటి తూర్పు, మధ్య ప్రాంతాలతో పాటు బంజారాహిల్స్, అమీర్‌పేట, సనత్ నగర్ వంటి పశ్చిమ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఈ కుండపోత వాన ధాటికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అనేక రహదారులపై పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా కార్యాలయాల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే సమయం కావడంతో పలు ప్రధాన కూడళ్లలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నిలిచిన నీటిలో వాహనాలు మొరాయించడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.
హైదరాబాద్ లో భారీ వర్షం..
- Advertisement -
- Advertisement -