- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. బర్కత్‌పుర, నల్లకుంట, హిమాయత్‌నగర్, కోఠి, నారాయణగూడ, కాచిగూడ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట, అబిడ్స్, ఖైరతాబాద్, దిల్ సుఖ్ నగర్, యూసఫ్ గూడ, బోరబండ తదితర ప్రాంతాలల్లో వర్షం పడుతోంది. వర్షం కారణంగా పలుచోట్ల వరదనీరు రోడ్లపైకి చేరింది. దీంతో అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. జీహెచ్‌ఎంసీ, హైడ్రా బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.
- Advertisement -