Wednesday, September 17, 2025
E-PAPER
Homeజిల్లాలుకమ్మర్ పల్లిలో భారీ వర్షం

కమ్మర్ పల్లిలో భారీ వర్షం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి వర్షం కురుస్తున్నప్పటికిని సాయంత్రం మాత్రం భారీ వర్షం పడింది. కొద్దిరోజులు ఆగిన వర్షాలు మళ్లీ భారీ వర్షంతో మొదలవడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఒకటి రెండు రోజుల తర్వాత తెరిపినిస్తే పంటలు బాగుంటాయని, లేకపోతే నీరు పట్టి పంటలు దెబ్బ తినేందుకు ఆస్కారం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. 

కొద్దిరోజుల క్రితం కూడా భారీ వర్షాలు పడ్డప్పటికిని చెరువులు మాత్రం ఇప్పటివరకు ఆలుగులు పారలేదు. ఈ వర్షాలతోనైనా చెరువులు నుండి అలుగులు పారుతాయేమోనని రైతులు ఆశగా  రైతులు ఎదురుచూస్తున్నారు.  వినాయక చవితి పండగ అయినప్పటికిని భారీ వర్షం మూలంగా ప్రజలు సాయంత్రం తర్వాత ఇండ్లలో నుండి బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాల నేపథ్యంలో శిథిలవస్థలో ఉన్న ఇండ్లలో ఉంటున్న ప్రజలు ఆయా గ్రామ పంచాయతీల్లో  ఏర్పాటు చేసిన పునరవాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.భారీ వర్షం మూలంగా డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -