Monday, February 23, 2026
E-PAPER
Homeకరీంనగర్రాయికల్‌లో భారీ వర్షం

రాయికల్‌లో భారీ వర్షం

- Advertisement -

నవతెలంగాణ – రాయికల్
రాయికల్ పట్టణంలో సోమవారం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రధాన రహదారులు, కాలనీలు నీటితో నిండిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో మురికి కాలువలు పొంగిపొర్లి రోడ్లపైకి నీరు చేరింది. వర్షపు నీరు నిల్వ ఉండడంతో పాటు రాయికల్-కోరుట్ల మధ్య రహదారిపై చెట్ల కొమ్మలు విరిగిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా కూడా కొంతసేపు నిలిచిపోయినట్లు స్థానికులు తెలిపారు. పట్టణంలో మురుగు కాలువల శుభ్రతపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మండల వ్యాప్తంగా కురిసిన వర్షానికి పిందె దశలో ఉన్న మామిడి కాయలు నేలరాలగా,మొక్కజొన్న పంట కూడా నేలవాలిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -