- Advertisement -
నవతెలంగాణ – బజార్ హాత్నూర్
శుక్రవారం రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి మండలంలోని పలు గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి. పలు గ్రామాల్లో వరద నీరు ఇండ్లలో, పంట పొలాల్లో చేరింది. మండలంలోని జల్లు గూడా, మడగూడ, జాతర్ల, అందుగూడ, దేగామా తదితర గ్రామాల్లో వర్షపు నీరు ఇండ్లలో చేరింది. అంతే కాకుండా మండలంలోని కొత్తపల్లి, జవహర్ నగర్, గాంధీనగర్, గిరిజాయి, డెడ్ర, మాన్కపూర్, ఉమర్డ, కాండ్లి తదితర గ్రామాలు బాహ్య ప్రపంచానికి దూరంగా జల దిగ్బంధంగా మారాయి. మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో, ఆదర్శ పాఠశాలలో వర్షపు నీరు చేరింది.
- Advertisement -