- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షపాతం నమోదవ్వచ్చని తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఈ ఉదయం ఒక ప్రకటన విడుదల చేసింది.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. వీటితో పాటు నల్గొండ, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- Advertisement -