Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండలంలో భారీ వర్షం 

మండలంలో భారీ వర్షం 

- Advertisement -

లోతట్టు ప్రాంతాలు జలమయం 
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు 
పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
నీట మునిగిన పంటపొలాలు 
నవతెలంగాణ -పెద్దవంగర: మొంథా తుపాను నేపథ్యంలో మండల వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం నుండి కురుస్తున్న వర్షాలతో మండలంలో పలు రహదారులు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. పెద్దవంగర పాత ఎస్సీ కాలనీ లోని వీధులన్నీ వర్షపు నీటితో కుంటను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో మండలంలోని రామచంద్రు తండా- పెద్దవంగర, పోచంపల్లి -గంట్లకుంట, ఉప్పెరగూడెం- తొర్రూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు పెద్దవంగర, వడ్డెకొత్తపల్లి, కొరిపల్లి, పోచంపల్లి, చిట్యాల తో పాటుగా, పలు గ్రామాల్లో పంటలు నీట మునిగిపోయి. మండలంలో మొంథా తుపాను అన్నదాతకు కన్నీరు మిగిల్చింది. భారీ వర్షాలతో మండలంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వివిధ ప్రాంతాల్లో కొన్ని గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -