– తడిసిన మొక్కజొన్న, సోయా
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ లో సోమవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. గంటకు పైగా ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. భారీ వర్షం కురవడంతో రైతులు కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, సోయా పంటలు తడిసి ముద్దయ్యాయి. ఇప్పటికే ఇటీవల నిరంతరం కురిసిన వర్షాలతో మొక్కజొన్న, సోయా పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట కోతలు పూర్తిచేసి కల్లాల్లో ఆరబోసుకున్నారు. గత రెండు రోజులుగా అర్ధరాత్రి భారీ వర్షాలు కురిసాయి. దీంట్లో మొక్కజొన్న సోయా పంటలు పూర్తిగా తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన పంటలు రంగు మారడం, మొలకలు రావడం వల్ల ధర పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలే ప్రభుత్వం మొక్కజొన్న, సోయాబీన్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించి పంటలను అమ్ముకుంటున్నారు. ఈ నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తమ పంటలను కాపాడుకునేందుకు రైతులు తాటిపత్రాలను కప్పినప్పటికిని పంటలు తడిసి ముద్దయ్యాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ పంటలు తడవడం మూలంగా నాణ్యత దెబ్బతింటుందని తద్వారా పంటను దళారులు అడిగిన ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని విచారణ వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని మంగళవారం ఉదయం రైతులు ఆరబెట్టడం కనిపించింది.
ఉప్లూర్ లో అర్ధరాత్రి భారీ వర్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES