నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ పట్టణంలో గురువారం ఉదయం తెల్లవారుజామునుండే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గత వారం రోజులుగా ఉక్కపోతతో విసిగిపోయిన ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది.వర్షం కొనసాగుతుండటంతో నగరవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరంపై మేఘాలు కమ్ముకొని చీకటిచ్చిన వాతావరణం ఏర్పడింది. వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది.స్కూల్లు, కార్యాలయాలకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇక ఈ వర్షం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సాగు కాలంలో ఉండటంతో ఈ వర్షాలు పంటలకు మేలు చేస్తాయని, భూమిలో తేమ పెరిగి విత్తనాల మొలకలలో సహాయపడతాయని భావిస్తున్నారు.ముఖ్యంగా వరి, మక్క, పత్తి సాగు చేసే రైతులకు ఇది ఆశాజనకంగా మారిందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ ప్రకారం, వచ్చే 24 గంటల పాటు జిల్లాలో, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.
తెల్లవారుజామునుండే ఉరుములతో కూడిన భారీ వర్షం
- Advertisement -
- Advertisement -



