– నగరాన్ని కాపాడేందుకు యంత్రాంగం సిద్ధం
– ప్రజల భద్రతే ప్రాధాన్యం: కమిషనర్ ఏ.శైలజ
– పోలీసు, రెవెన్యూ, విద్యుత్, వైద్య బృందాలు రెడీ
– నీటి ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
నవతెలంగాణ-బోడుప్పల్: నగరంలో రాబోయే 72 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అత్యవసర చర్యలకు సిద్ధమైంది. బుధవారం కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో కమిషనర్ ఏ. శైలజ అధ్యక్షతన పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, విద్యుత్, ఇరిగేషన్ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. “వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మున్సిపల్ సిబ్బందితోపాటు పోలీసు, వైద్య, విద్యుత్ శాఖలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నీటి ముంపు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజలకు ముందు జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించడం, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించడం, ప్రమాద ప్రాంతాల గుర్తింపు, రక్షణ బృందాల సిద్ధం వంటి అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది.
హెచ్చరిక.. 72 గంటలు భారీ వర్షాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES