-వైద్యారోగ్య సలహా సూచనిలివే
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
భారీ వర్షాల కారణంగా ప్రజలు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. నరేందర్ రాథోడ్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్, నీటిబారిన వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రజలు పలు సూచనలను పాటించాలని సూచించారు.
ప్రజలు ఈ సలహా సూచనలు పాటించాలి
1. మరిగించి చల్లార్చిన నీటినే తాగాలి.. శుద్ధి చేసిన నీరు మాత్రమే ఉపయోగించాలి.
2. ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. పూల కుండీలు, కూలర్, టైర్లు, డబ్బాలలో నీరు నిల్వ లేకుండా తరచుగా శుభ్రం చేయాలి.
3. దోమల కాటుకు గురి కాకుండా మస్కిటో నెట్స్, కాయిల్, రిపెలెంట్స్ వాడాలి. పూర్తి బట్టలు ధరించాలి.. బయట వర్షపు నీటిలో ఆడకూడదు, నడవకూడదు.
4. బయట పాడైపోయే ఆహారం తినకూడదు. తాజాగా వండి వేడి వేడి ఆహారమే తీసుకోవాలి.
5. జ్వరం, వాంతులు, విరేచనాలు, కళ్లలో పసుపు, శరీర నొప్పులు ఉంటే వెంటనే సమీపంలోని ప్రభుత్వ దవాఖాన/పీహెచ్.సి/సీహెచ్.సీల ను సంప్రదించాలి. స్వయంగా మందులు వాడకూడదు.
6. గర్భిణీలు, చిన్నపిల్లలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదకర ప్రాంతాల్లో ఉండే గర్భిణీలను సురక్షిత ప్రదేశాలకు తరలించవచ్చు.
7. ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే 108 అంబులెన్స్ సేవలు వినియోగించుకోవచ్చు. జిల్లా ఎపిడెమిక్ కంట్రోల్ రూమ్ నంబర్: 9491103108 ను సంప్రదించాలని సూచించారు.