- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిద్దిపేట కలెక్టర్ రేపు(గురువారం) జిల్లాలోని అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఇప్పటికే యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో సెలువ ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ కుండపోత వర్షాలు కురుస్తుండటంతో సెలవు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
- Advertisement -



