Wednesday, May 21, 2025
Homeజాతీయంబెంగళూరులో భారీ వర్షాలు

బెంగళూరులో భారీ వర్షాలు

- Advertisement -

సగం నగరం నీటిలోనే
బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆదివారం నుంచీ కురుస్తున్న ఈ వర్షాలకు దాదాపు సగం నగరం నీటమునిగింది. జన జీవనం అస్థవ్యస్తమైంది. బెంగళూరుతోపాటు కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కన్నడ, ఉడిపి, చిక్కామంగళూరు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. బెంగళూరులో అనేక ప్రాంతాలు జలమయ్యాయి. నీరు నిలవ వుండిపోవడం, ట్రాఫిక్‌ జామ్‌లతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఆదివారం నుంచే విద్యుత్‌, మంచినీటి సరఫరా నిలిచిపోయింది. నిర్మాణంలో ఉన్న సెంట్రల్‌ సిల్క్‌ బోర్డు మెట్రోస్టేషన్‌ పూర్తిగా నీట మునిగిపోయింది. వైట్‌ఫీల్డ్‌ ప్రాంతంలో గోడ కూలి 35 ఏళ్ల మహిళ మరణించింది. నీటమునిగిన ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడానికి, వారికి ఆహారం, మంచినీరు అందించడానికి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
సిఎం సమీక్ష
భారీవర్షాలు, అనంతర పరిస్థితిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమీక్షా సమావేశం నిర్వహించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గోడ కూలి మరణించిన మహిళ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. భారత వాతారణ శాఖ మంగళవారం కర్ణాటక ప్రాంతానికి రెడ్‌ అలెర్టు ప్రకటించింది. మరో రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నెల 23 వరకూ మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -