Friday, September 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్ లో దంచికొట్టిన వాన

హైదరాబాద్ లో దంచికొట్టిన వాన

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లోనూ వర్షం దంచికొడుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. దాదాపు రోడ్లపైకి వరదనీరు చేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్థంభించింది. ముఖ్యంగా హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మూసాపేట, అమీర్‌పేట, పంజాగుట్ట, కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీ నగర్‌, పంజాగుట్ట, లక్డీకపూల్, నారాయణగూడ, ఖైరతాబాద్, సోజాజీగూడ, అమీర్ పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హయత్ నగర్, ఉప్పల్, అంబర్ పేట్ ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరం నలువైపులా వాహనాల్లో ప్రయాణికులు, చిక్కుకుని తీవ్ర అవస్థలు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై ఉన్న గుంతలు కనిపించక అదుపుతప్పి కింద పడుతున్నారు. దీంతో వెంటనే స్పందించిన హైడ్రా, జీహెచ్‌ఎంసీ, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -