Thursday, October 30, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవియత్నాలో భారీ వర్షాలు.. 10 మంది మృతి

వియత్నాలో భారీ వర్షాలు.. 10 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వియత్నాంలో ఇటీవల భారీ వర్షాలు వరదలు సంభవించాయి. ఈ వారంలో వరదల వల్ల పదిమంది మృతి చెందారు. అలాగే పర్యాటక ప్రదేశాలకు సమీపంలో ఉన్న ఒక ప్రధాన నది నీటిమట్టం 60 సంవత్సరాల క్రితం కంటే.. గరిష్ట స్థాయిలో నీటిమట్టం పెరిగి ఉధృతంగా ప్రవహిస్తోందని గురువారం అధికారులు తెలిపారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం హోరు యాన్‌ పురాతన పట్టణానికి నిలయమైన వియత్నాం తీరప్రాంత ప్రావిన్సులు ఈ వారంలో కురిసిన భారీ వర్షంతో అతలాకుతలమయ్యాయి. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1.7 మీ (5 అడుగుల 7 అంగుళాలు) వర్షం కురిసింది. ఈ వరదలకు పదిమంది మృతి చెందారు. ఎనిమిది మంది గల్లంతయ్యారని పర్యావరణ మంత్రిత్వశాఖ తెలిపింది.
కాగా, ఈ వరదలకు ఐదు ప్రావిన్స్‌లలో 128,000లకు పైగా ఇళ్లు నీటమునిగాయి. కొన్ని ప్రాంతాల్లో మూడు మీటర్ల లోతు నీరు నిల్వ ఉంది. హోరు యాన్‌ వీధుల్లో నడుమల్లోతు నీరు నిలిచి ఉంది. ప్రజల రాకపోకలకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాల్లో గ్రౌండ్‌ఫ్లోర్‌ల్లో నీరు చేరింది. కొన్ని కిలోమీటర్ల వరకు రోడ్లు ధ్వంసమయ్యాయి. ఈ వారంలో వరదల వల్ల రోడ్లు కూడా బ్లాక్‌ అయ్యాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఐదు వేల ఎకరాలకు పైగా హెక్టార్లలో పంట నాశనమైంది. 16 వేల పశువులు మృతి చెందాయని పర్యావరణ మంత్రిత్వశాఖ తెలిపింది.
1964లో థు బోన్‌ నది నీటి మట్టం కంటే బుధవారం నాలుగు సెంటిమీటర్లు పెరిగి 5.62 మీటర్లకు చేరుకుంది. తన జీవితంలో ఇంత భయంకరమైన వరదలను ఎప్పుడూ చూడలేదని డానాంగ్‌ నివాసి 58 ఏళ్ల లే థిథి అన్నారు. ఈ ఏడాదిలో గడచిన 9 నెలల్లో తుఫానులు, వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల వియత్నాంలో 187 మంది మరణించారు లేదా గల్లంతయ్యారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో ప్రకృతి విపత్తు వల్ల 610 బిలియన్‌ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -