- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ వాసులు ఈ ఉదయం భారీ వర్షంతో నిద్రలేచారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో పలు రోడ్లు జలమయం అయ్యాయి. ఉదయం ఆఫిసులకు వెళ్లే వహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా, రానున్న గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది.
వాతావరణ శాఖ సూచన ప్రకారం, రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ, ఆ రోజుకు ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించింది.
- Advertisement -



