Sunday, October 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అధిక వర్షాలు.. ముందస్తు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

అధిక వర్షాలు.. ముందస్తు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలో ఉదయం నుండి కురుస్తున్న వర్షాల కారణంగా పట్టణంలో గతంలో ముంపునకు గురైన జి ఆర్ కాలనీలలో ఆదివారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మున్సిపల్ కమిషనర్ సిహెచ్, రాజేందర్రెడ్డి సానిటరీ ఇన్స్పెక్టర్ పర్వీజ్, రెవెన్యూ, పోలీసు సిబ్బందితో కలిసి పర్యటించి ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షం వలన జి ఆర్ కాలనీ బ్రిడ్జి వద్ద ప్రవహిస్తున్న నీటి ఉద్రితిని ప్రత్యక్షంగా పరిశీలించారు.

 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో భారీ వర్షాల వలన కలిగిన ఇబ్బందులను, నష్టాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు అప్రమత్తంగా ఉండి కాలనీవాసులను అప్రమత్తం చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా తక్షణ చర్యలను చేపట్టవలసిందిగా అధికారులను ఆదేశించారు. జి ఆర్ కాలనీతో పాటు కామరెడ్డి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నింటిలో అధికారులు పర్యటిస్తూ అధిక వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -