Saturday, September 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అల్పపీడన ప్రభావంతో … తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం కేంద్రీకఅతమైందని ఐఎండీ తెలిపింది. 48 గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఎపిలో, తెలంగాణలో భారీ వర్షాలు …
అల్పపీడనం ప్రభావంతో ఎపిలో మూడు నాలుగు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఎపి విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురువొచ్చని వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు తెలంగాణలోనూ 5 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేశాయి. రేపటి రోజున పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలతోపాటు 30 -40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -