- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : వాయుగుండం ప్రభావంతో వికారాబాద్, సంగారెడ్డిలో ఇవాళ ఉ.8.30 గంటలలోపు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, మెదక్, కామారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్‌లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల భారీ వానలు పడే అవకాశముందని పేర్కొంది.
- Advertisement -