- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మొంథా తీవ్ర తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నందున ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది. తుపాను ప్రభావిత జిల్లాల్లో రహదారులపై ఆంక్షలు విధించింది. జాతీయ రహదారులపై ప్రయాణించే భారీ వాహనాలు రాత్రి 7 గంటల నుంచి నిలిపివేయాలని పేర్కొంది. వాహనాలను ముందే సురక్షిత లేబేలో నిలపాలని సూచించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.
- Advertisement -



