Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంకోడెల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి

కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి

- Advertisement -

– వ్యవసాయ అవసరాలకే వినియోగించాలి :రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా
– రైతులకు వేములవాడ ఆలయం గోశాల కోడెల పంపిణీ
నవతెలంగాణ – సిరిసిల్ల

కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పంపిణీ చేస్తున్న కోడెలను వ్యవసాయ అవసరాలకు మాత్రమే వినియోగించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన తిప్పాపూర్‌లోని గోశాలలో శుక్రవారం 50జతల కోడెలను(100కోడెలు) రైతులకు పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 375జతల(750కోడెలు) పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గోశాల నుంచి పంపిణీ చేసే కోడెలను వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలన్నారు. వాటిని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సంరక్షించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌ బేగం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్‌ రెడ్డి, గోశాల కమిటీ సభ్యులు రాధాకష్ణారెడ్డి, పశు వైద్యాధికారులు, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad