Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సురక్షిత ప్రయాణానికి హెల్మెట్‌ తప్పనిసరి

సురక్షిత ప్రయాణానికి హెల్మెట్‌ తప్పనిసరి

- Advertisement -

• ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్ 
నవతెలంగాణ -పెద్దవంగర
సురక్షిత ప్రయాణానికి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చాలామంది ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్‌ ధరించని కారణంగానే రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారని తెలిపారు. తలకు తీవ్రగాయాలు పాలై గోల్డెన్‌ అవర్స్‌లో చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. హెల్మెట్‌ ధరించడంతో కలిగే ప్రయోజనాలను వాహనదారులకు వివరించారు. తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, లేదంటే ఎంవీ నిబంధనల ప్రకారం అపరాధ రుసుం విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రాజారాం, కానిస్టేబుల్ సుధాకర్, వాహనదారులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -