Wednesday, October 1, 2025
E-PAPER
Homeజాతీయంవరద బాధితులను ఆదుకోండి

వరద బాధితులను ఆదుకోండి

- Advertisement -
  • విరాళాలు సేకరించాల్సిందిగా పార్టీ శాఖలకు సీపీఐ(ఎం) పిలుపు

    న్యూఢిల్లీ : అసాధారణ రుతుపవనాలు, దానికి తోడైన మానవ తప్పిదాల ఫలితంగా ఈసారి వాయవ్య భారతంలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించాయి. పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్మూకాశ్మీర్‌, హర్యానా, రాజస్తాన్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో కుంభవృష్టి కురిసింది. కొద్ది రోజులుగా కుండపోతగా కురిసిన వర్షాలకు వరదలు సంభవించడంతో పాటూ పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఆయా రాష్ట్రాల్లోని ప్రజలు అత్యవసర సాయానికై ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారని సిపిఎం పేర్కొంది. ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో అవసరంలో ఉన్నవారికి సాయమందించేందుకుగానూ విరాళాలను సేకరించాల్సిందిగా పార్టీ అన్ని శాఖలకు, కార్యకర్తలకు పిలుపిచ్చింది. ఈ మేరకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ ఒక ప్రకటన విడుదల చేశారు. వసూలు చేసిన నిధులను ఈ దిగువన గల అకౌంట్‌ నెంబరుకు పంపితే తద్వారా బాధిత రాష్ట్రాలకు ముఖ్యంగా బాధితుల సహాయ, పునరావాస చర్యలకు ఆ మొత్తాన్ని పంపడానికి వీలు వుంటుందని బేబీ వివరించారు.
    అకౌంట్‌ పేరు : కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్ట్‌)
    అకౌంట్‌ నెంబరు : 07621000432853
    ఐఎఫ్‌ఎస్‌ కోడ్‌ : పిఎస్‌ఐబి0000762
    పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, గోల్‌ మార్కెట్‌, న్యూఢిల్లీ విరాళాలను బదిలీ చేసినపుడు వెంటనే కేంద్ర కమిటీ కార్యాలయానికి తెలియచేసిన పక్షంలో సక్రమంగా ఖాతాలు నిర్వహించడానికి వీలు ఉంటుందని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -