నవతెలంగాణ – పాలకుర్తి
పాలకుర్తి ఎస్సీ కాలనీకి చెందిన గాదెపాక చిన్న యాకయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో పాలకుర్తి సొసైటీ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎడవెల్లి పుష్పలత సోమల్లయ్య మృతుడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుడి కుటుంబానికి 50 కిలోల బియ్యంతో పాటు నిత్యవసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా పుష్పలత సోమలయ్యలు మాట్లాడుతూ పేదలను ఆదుకునేందుకే ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డిల సేవా కార్యక్రమాల స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ గద్దల యాకసోమయ్య, ఎడవెల్లి సుభాష్, ఎడవెల్లి వెంకటేశ్వర్లు, ఎడవెల్లి సునీల్ మహాజన్,భాస్కర్, యాకయ్య, సోమయ్య,గాదెపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నిరుపేద కుటుంబానికి సహాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES