నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని గాంధీనగర్ లో ఇటీవల కాలువలో చేపల వేటకు వెళ్లి విద్యుత్ వైర్ తగిలి చనిపోయిన నరసింహులు, లక్ష్మణ్ కుటుంబాలకు స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేయూత అందించారు. మృతుల కుటుంబ సభ్యులకు మంగళవారం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబానికి 50 కిలోల బియ్యం, 5 కిలోల నూనె, 5 కిలోల పప్పు, రూ.2500 నగదు అందజేశారు. అదేవిధంగా గ్రామానికి చెందిన గుండోజి నరేష్ తనవంతుగా బాధిత కుటుంబాలకు 25 కిలోల చొప్పున రైస్ బ్యాగును అందజేశారు. తమ కుటుంబాలకు చేయూతనందించిన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు, గుండోజి నరేష్ కు మృతుల కుటుంబ సభ్యులు, గాంధీనగర్ కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగ రామస్వామి, క్యాషియర్ నూకల బుచ్చి మల్లయ్య, సభ్యులు సున్నం మోహన్, నిమ్మ రాజేంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు చేయూత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES