Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాల్యమిత్రుడి కుటుంబానికి సహాయం 

బాల్యమిత్రుడి కుటుంబానికి సహాయం 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
పాలకుర్తి గ్రామానికి చెందిన పన్నీరు నాగరాజు అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవలే మృతి చెందడంతో 1997-98 విద్యా సంవత్సరానికి చెందిన 10వ తరగతి విద్యార్థులు మంగళవారం బాల్యమిత్రుడి కుటుంబానికి 20,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం బాల్య మిత్రులు మాట్లాడుతూ ఆపదలో ఉన్న బాల్య మిత్రులకు, బాల్య మిత్రుల కుటుంబాలను ఆదుకునేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. బాల్యమిత్రుని కుటుంబాన్ని ఆదుకోవడం పట్ల పలువురు అభినందించారు.

 ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పాలకుర్తి పట్టణ కార్యదర్శి పన్నీరు వెంకన్న, తోటి స్నేహితులు ఇండ్ల సునీత, ముతోజు రాజు, సలేంద్ర సోమన్న, బెల్లి యుగేందర్, కమ్మగాని  మధు, కమ్మగాని అశోక్, ఆవిరినేని పోతన రావు, పెద్దూరి ఎలేందర్, ఎండి  అశోక్, కమ్మగాని కుమార్, యాకూబ్ నాయక్, నాయిని కరుణాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -