- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన కొంతం బొంద్యాలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. రాష్ట్ర ఐటి మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జనగామ లక్ష్మీరాజు ఆధ్వర్యంలో మంగళవారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చారు. ఈ సందర్భంగా 50 కిలోల సన్న బియ్యం అందజేసి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



