- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని శివన్నగూడ గ్రామానికి చెందిన తాటికొండ రమేష్ కుమారుడు మనికేష్ బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ రెండు నెలలుగా హైదరాబాదులో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే మనికేష్ చికిత్సకు 18 లక్షలు ఖర్చు కాగా తమకు తోచినంత సహాయం అందిద్దామని గురువారం రమేష్ (2013-14 పదవ తరగతి బ్యాచ్) స్నేహితులు రూ.72 వేల ఆర్థిక సాయం అందజేశారు.మనికేష్ చికిత్సకు దాతలు ఆర్థిక సాయం అందజేయాలని కుటుంబ సభ్యులు, స్నేహితులు కోరుతున్నారు.
- Advertisement -



