- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
అమెరికాకు చెందిన శ్రీలత కోరాడ స్థాపించిన హెల్ప్ టు అదర్స్ ఆధ్వర్యంలో మామిడిపల్లి- ఆర్మూర్ లో గల తపస్వి స్వచంద సేవ సమస్త చిల్డ్రన్ హోమ్ లో రూ.25 వేల నిత్యవసర సరుకులను ఇండియా ప్రతినిధులు జిలకర లావణ్య తపస్వి సంరక్షకులు శ్రీనివాస్, కవిత లకు అందచేశారు. ఆ సందర్బంగా లావణ్య మాట్లాడుతూ..పిల్లల కొరకు హెచ్ఓ్ టు వ్యవస్థాపకురాలు కోరాడ శ్రీలత మామిడిపల్లి తపస్వి స్వచంద సేవ సమస్త కు నిత్యం వివిధ రకాల సహాయంతో పాటు వారికి తెలిసిన స్నేహితుల, బంధువుల పుట్టినరోజు, పెళ్లిరోజు సందర్భంగా కూడా భోజన సదుపాయం అందిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయానంద్, గుండు నరేష్ పాల్గొన్నారు.
- Advertisement -