నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : ఇటీవల ఇండియా, పాకిస్తాన్ ల మధ్య యుద్ధం జరుగుతుండడంతో భారత సైన్యానికి తన వంతు కర్తవ్యంగా రూ.1 లక్ష విరాళాన్ని తన తల్లి (ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బీర్ల ఐలయ్య సతీమణి) అనితతో కుమారుడు శివమణి వెళ్లి స్వయంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు అందజేశారు. సోమవారం కలెక్టరేట్ కు విచ్చేసి తాను దాచుకున్న సొమ్మును మాత్రమే తనవంతు కర్తవ్యంగా సైనికులకు విరాళంగా జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్నతనంలోనే ఇంతటి ఔదార్యాన్ని కనబరిచిన శివమణి భవిష్యత్తులో మరింత ప్రయోజకుడు కావాలని, ఎన్నో సమాజ హితం కోరే కార్యక్రమాలు చేపట్టాలని తాను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా శివమణి తో శివమణి మాతృమూర్తి అయిన ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సతీమణిని కలెక్టర్ శాలువాతో ఘనంగా సన్మానించారు.
భారత సైన్యానికి తనవంతు సాయం..
- Advertisement -
- Advertisement -